
గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా మెగాస్టార్ కి సెల్యూట్ చేస్తూ గుణ టీం వర్క్స్ రూపొందించిన టీజర్ ని విడుదలచేసారు.
ఈ వీడియో విడుదలైన వెంటనే సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో హల్ చల్ సృష్టించింది. ఈ చిత్రానికి చిరు గాత్రం తప్పకుండా ఉపయోగపడుతుందని అందరి భావన.
భారతదేశంలో రూపొందించిన మొట్టమొదటి 3D హిస్టారికల్ చిత్రంగా రుద్రమదేవి చరిత్రలో నిలిచింది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ లు నటిస్తున్నారు.