హాట్ అండ్ బబ్లీ గర్ల్ ఛార్మీ నటించిన ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా విడుదలై ఇంకా రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం, మహిళా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లబించడంతో ఛార్మీ చాలా హ్యాపీగా ఉంది. ఇదిలా ఉంటే ఛార్మీ నటించిన మరో మూవీ ‘మంత్ర 2’. కెరీర్ మొదట్లో చార్మింగ్ బ్యూటీ చార్మీ చేసిన గ్లామరస్ రోల్స్ ఎంత పేరు తీసుకొచ్చాయో, అంతకు మించి గుర్తింపు తెచ్చిన మూవీ ‘మంత్ర’. దానికి కొనసాగింపుగా మరో హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న సినిమా ‘మంత్ర 2’.
షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసారు. అన్ని కార్యక్రమాలను ఫినిష్ చేసి జూలై 3న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘మంత్ర’ సినిమాని మించి ‘మంత్ర 2’ ఉంటుందని అంటున్న ఈ సినిమా ద్వారా కెవి సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. బోనాల శ్రీకాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సీక్వెల్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ మెప్పిస్తుందా లేదా అన్నదాని కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..
