‘బాహుబలి’లో తన రోల్ గురించి తమన్నా..!

tamanna
తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అందాల భామ తమన్నా, త్వరలో బాహుబలి ద్వారా ప్రేక్షకుడిని కట్టిపడేసేందుకు సిద్ధమౌతోంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి మొదటి భాగంలో తమన్నా అవంతికగా కనిపించనున్న విషయం తెలిసిందే! యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతుండడంతో దేశవ్యాప్తంగా సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.

బాలీవుడ్ మీడియాతో ప్రభాస్, రానా, తమన్నాలు ముచ్చటిస్తూ ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇక ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలిలో తన రోల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తమన్నా తెలిపింది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా కనిపించడానికి కొంత బరువు పెరగాల్సి వచ్చిందని, యువరాణి అవంతిక పాత్రలో కనిపించనున్న తమన్నా, ఆ పాత్ర కోసం కొన్ని ఫైట్లు కూడా చేయాల్సి వచ్చిందని తెలిపింది. మరి తమన్నా చేసిన ఫైట్లు ఎలా ఉన్నాయో చూడాలంటే.. జూలై 10వరకూ ఆగాల్సిందే!

Exit mobile version