ప్రీ ప్రొడక్షన్ దశలో రోబో 2

shankar_rajinikanth
రజినికాంత్, శంకర్ ల కాంబినేషన్ లో త్వరలో రోబో 2 రానుందని మేము ఇదివరకే ప్రకటించాం. ప్రస్తుతం రజిని తన స్నేహితుడు రంజిత్ తో చిత్రం ముగిసిన వెంటనే ఈ సినిమా ప్రారంభం కానుంది. సమాచారం ప్రకారం తమిళనాడుకి చెందిన ఒక ప్రముఖ రచయితను స్క్రిప్ట్ కోసం శంకర్ ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, శంకర్ స్సిప్ట్ కోసం జెయ్ మోహన్ ని సంప్రదించారని తెలుస్తుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలిపే అవకాశం వుంది.

Exit mobile version