అమెరికాలో దుమ్మురేపుతున్న ‘బాహుబలి’!

Baahubali-tamil

ప్రతి సినీ అభిమానీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన సినిమా ‘బాహుబలి’ నిన్న థియేటర్లకు రానే వచ్చింది. మూడేళ్ళుగా ఎదురుచూసాక వచ్చిన ఓ ప్రతిష్టాత్మక సినిమా థియేటర్లలో పడితే ఎలా ఉంటుందో బాహుబలి కలెక్షన్లు నిరూపించి చూపాయి. దేశంలోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా బాహుబలి నిలిచి రికార్డు సృష్టించింది.

ఇక దేశవ్యాప్తంగా ‘బాహుబలి’ హంగామా ఇలా ఉంటే.. ఓవర్సీస్‌లో, ముఖ్యంగా అమెరికాలో బాహుబలి కలెక్షన్ల పరంగా దుమ్ము రేఫుతోంది. గురువారం రోజు ప్రీమియర్ షోలతో 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించిన బాహుబలి, రెండో రోజు కూడా 1 మిలియన్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటివరకూ రూపాయల్లో లెక్కేసుకుంటే సుమారు 16 కోట్ల రూపాయలు వసూలు చేసి అమెరికాలో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన తెలుగు సినిమాగా బాహుబలి నిలిచింది. శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు కాగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించారు.

Exit mobile version