వీక్ డే అయినా హిందీలో అదరగొట్టిన ‘బాహుబలి’

Baahubali-pposter
పోయిన వారం అంతా సినిమా రిలీజ్ క్రేజ్, గత 5 రోజుల నుంచి రికార్డుల మోతతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా బాహుబలి. ప్రపంచలోని తెలుగు వారందరూ గౌరవించదగ్గ సినిమా అందించినందుకు తెలుగు వారంతా ఎస్ఎస్ రాజమౌళికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. అలాంటి సినిమా కోసం అంత సమయం కేటాయించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలకి కూడా వారి అభినందనలు తెలియజేస్తున్నారు. గత 5 రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒకే ఒక్క పేరు బాహుబలి. ఇప్పటికే తెలుగులో ఆల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసిన బాహుబలి హిందీలో కూడా కలెక్షన్స్ దుమ్ములేపుతోంది.

మొదటి మూడు రోజుల్లో 20 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన డబ్బింగ్ సినిమా అయిన బాహుబలి వీక్ డే అయిన సోమవారం కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంది. సోమవారం మాత్రమే 6.1కోట్ల షేర్ సాధించింది. మొదటి రోజు కాస్త తక్కువ షేర్ తో మొదలైనా ఆ తర్వాత నుంచి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే కలెక్షన్స్ ని నమోదు చేసింది. కేవలం హిందీలో మొదటి నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసిన షేర్ వివరాలు..

వారం
కలెక్షన్స్ (షేర్)
శుక్ర వారం 5.15 కోట్లు
శని వారం 7.09 కోట్లు
ఆది వారం 10.11 కోట్లు
సోమవారం  6.10 కోట్లు
మొత్తం 28.45 కోట్లు

ఒక తెలుగు సినిమా డబ్ వెర్షన్ బాలీవుడ్ లో జస్ట్ నాలుగు రోజుల్లో 30కోట్ల మార్క్ కి దగ్గరవ్వడం ఓ రికార్డ్ అని చెప్పాలి. ఫస్ట్ వీక్ కి సంబందించిన ప్రత్యేక కలెక్షన్ రిపోర్ట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం.. స్పెషల్ అప్డేట్స్ కోసం 123తెలుగు. కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version