
తెలుగు వారందరూ గర్వంగా ఫీలయ్యేలా చెయ్యడమే కాకుండా, టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. ఆడియన్స్ మెప్పుతో పాటు కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీసు వద్ద సునామీ సృష్టించిన సినిమా ‘బాహుబలి’. మొదటివారంలో వచ్చిన్ కలెక్షన్స్ తోనే ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసింది. వీటన్నిటికీ మించి భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల స్టార్స్ నుంచి ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ లభించింది. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి వర్క్, స్టార్స్ అయిన ప్రభాస్, రానాల పెర్ఫార్మన్స్ లపై కూడా పొగడ్తల వర్షం కురిపించెను.
తాజాగా బాహుబలి పై పొగడ్తల వర్షం కురిపించిన స్టార్స్ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. మహేష్ తేమలోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు. ‘ ఈ రోజే స్విట్జర్లాండ్ నుండి వచ్చాను. విజువల్ వండర్ బాహుబలి చూసాను. మన తెలుగు సినిమా ఇండియా మరియు వరల్డ్ వైడ్ గా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మనం గర్వంగా ఫీలవ్వాల్సిన అసలైన మోమెంట్ ఇది. ఎస్ఎస్ రాజమౌళి మన తెలుగు ఇండస్ట్రీకి చెందినవాడు కావడం ఎంతో గర్వం. ఎంఎం కీరవాణి గారి సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఫీలింగ్ ప్రౌడ్. ఇలాంటి ఫిల్మ్ ని ఇచ్చిన ఆర్కా మీడియా వారికి హ్యాట్సాఫ్. ప్రభాస్, రానాల పెర్ఫార్మన్స్ టెర్రిఫిక్ గా ఉంది. వాళ్ళ హార్డ్ వర్క్, డెడికేషన్ ఈ రోజు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. టీం అందరికీ నా శుభాకాంక్షలని’ మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.