డిసెంబర్ నుంచి మెగా హీరో – సునీల్ రెడ్డి మూవీ

Sai-Dharma-Tej
‘రేయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారు. అలాగే ఈ సినిమాని ఆగష్టు 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఫినిషింగ్ లో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మరో ఇద్దరి డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాళ్ళే పటాస్ ఫేం అనిల్ రావిపూడి మరియు ఓం ఫేం సునీల్ రెడ్డి.

సునీల్ రెడ్డి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ చేయనున్న సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లుక్ పరంగా టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తాడట. ఈ యాక్షన్ డ్రామాలో సునీల్ రెడ్డి చాలా డిఫరెంట్ గా ఉండేలా హీరో పాత్రని డిజైన్ చేసాడట. అలాగే సినిమాలోని ఎక్కువ భాగాన్ని శ్రీలంకలో షూట్ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని ఓ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిర్మిస్తాడని సమాచారం. ఈ గ్యాప్ లో సాయి ధరమ్ తేజ్ అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నాడు.

Exit mobile version