అఖిల్ అక్కినేని ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్.?

Akhil
అక్కినేని అఖిల్ తెలుగు చిత్ర సీమలో అరంగేట్రం చేయనున్న మొదటి సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సినీ ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నల లిస్టులో అఖిల్ సినిమా టాప్ 5లో ఉంటుంది. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం సౌత్ ఆఫ్రికాలో సాంగ్స్ మరియు కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుంది.

ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ గురించి మీకో ఆసక్తికర విషయాన్ని అందిస్తున్నాం. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అఖిల్ ఫస్ట్ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ కావడంతో బాక్స్ ఆఫీసు వద్ద హెల్ప్ అవుతుందని గురువారం రోజునే ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. వచ్చే నెల మధ్యకల్లా షూటింగ్ ని పూశ్ర్తి చేసి మరో ఒకటిన్నర నెలలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోస్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగాయి.

అఖిల్ తో పాటు హీరోయిన్ గా సయేశా సైగల్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమాని యంగ్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version