మురుగదాస్ కథతో నారా రోహిత్ సినిమా మొదలైంది..!

nara_rohith
‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీఫెలో’ లాంటి డిఫరెంట్ మూవీస్‌తో అలరించిన నారా రోహిత్ ఈమధ్యే మరో డిఫరెంట్ మూవీ ‘అసుర’ ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘అసుర’ విజయం తర్వాత తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే సినిమాలను ఎంచుకుంటూ నారా రోహిత్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ కోవలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘సావిత్రి’, ‘పండగల వచ్చాడు’.. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

తాజాగా ఆయన ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ అందించిన కథతో రూపొందిన ‘మాన్ కరాటే’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మురుగదాస్ శిష్యుడు తిరుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాన్ కరాటే సినిమా తమిళ నాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర తెరకెక్కిస్తున్నారు. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. అశోక్, నాగార్జున్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జిల్ ఫేం కబీర్ విలన్‌గా నటించనున్నారు.

Exit mobile version