పెద్ద బ్యానర్‌లో ‘హోరా హోరీ’ హీరో దిలీప్

dileep

దిలీప్, దక్షలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు తేజ రూపొందించిన ‘హోరాహోరీ’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. తేజ తప్పకుండా హిట్ కొడతాడన్న నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మొదటిషో నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకొంది. ఒక రొటీన కథనే తేజ మళ్ళీ తీశారన్న వ్యాఖ్యలు వినబడ్డాయి. ఇక ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్‌గా కళ్యాణ్ కోడూరి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, హీరో దిలీప్, హీరోయిన్ దక్షల పర్ఫామెన్స్ నిలిచాయి. దిలీప్ మొదటి సినిమాతోనే బాగా మెప్పించారు.

ఇక ‘హోరా హోరీ’ విడుదలైన తర్వాత దిలీప్‌కు వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులు రావడం విశేషంగా కనిపిస్తోంది. ‘హోరా హోరీ’లో దిలీప్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం దిలీప్ హీరోగా చేయబోయే ఈ రెండు ప్రాజెక్టులూ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. రెండు సినిమాలూ పెద్ద బ్యానర్‌లో రూపొందనుండడం ఆసక్తికర అంశం. ఇక హోరా హోరీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దక్షకు కూడా పలు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

Exit mobile version