స్టార్ హీరోతో సినిమాకు సిద్ధమైన కొరటాల శివ

Koratala-Siva-ntr

కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టిన ఈ రచయిత, రెండో సినిమా ‘శ్రీమంతుడు’తో టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా దర్శకుడిగా కొరటాల శివకు ఓ మంచి గుర్తింపు తేవడంతో పాటు టాప్ దర్శకుల జాబితాలో చోటు కల్పించింది. ఒక బలమైన కాన్సెప్ట్‌ను కమర్షియల్‌గా చెప్పడంలో రెండు సార్లు సూపర్ సక్సెస్ అయిన శివ, ప్రస్తుతం తన మూడో సినిమా కోసం సిద్ధమవుతున్నారు.

ఎన్టీఆర్ హీరోగా, ‘శ్రీమంతుడు’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ నిర్మాణంలో కొరటాల శివ కొత్త సినిమా ఉండనుందన్న ప్రచారం జరుగుతూన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ దాదాపుగా ఖరారైందన సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మిర్చిలో ‘వీలైతే ప్రేమిద్దాం.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అని, ‘శ్రీమంతుడు’లో ఊరిని దత్తత తీసుకోవడం ఇలా తనదైన మార్క్ కథాంశాలను ఎంపిక చేసుకున్న కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి కాన్సెప్ట్ పట్టుకొస్తారనేది ఆసక్తికర అంశం.

Exit mobile version