మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించిన సాయిధరమ్ తేజ్, కమర్షియల్ హిట్స్‌తో టాప్ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతగా తనదంటూ బ్రాండ్ సెట్ చేసిన దిల్‌రాజు. ఈ ముగ్గురి కలయికలో రూపొంది, టాలీవుడ్లో ప్రస్తుతం అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. హరీష్ శంకర్ స్టైల్లో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం గత రెండు వారాల నుంచే టీమ్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది.
ఇప్పటికే సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళడంలో మంచి విజయం సాధించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ టీమ్, సినిమా రిలీజ్‌కు మరోవారం రోజులే ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. అంతటా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్ ఈ సినిమాపై మంచి అంచనాలు కల్పించగా, ఇప్పుడీ ప్రమోషన్స్ సినిమాకు మరింతగా ఉపయోగపడుతున్నాయి. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరీష్ శంకర్ చెబుతూ వస్తున్నారు.
