అక్కినేని వంశం నుంచి మూడో తరంలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అఖిల్, ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మొదటి సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ కావడంతో ఈ పేరు అంతటా మారుమోగిపోతోంది. ఒక్క ఇంట్రో సాంగ్ తప్ప మొత్తం షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిన్నటితో ఆ సాంగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఐదు భారీ సెట్స్‌లో అఖిల్ ఇంట్రో సాంగ్ చిత్రీకరించారు.
ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవ్వడంతో, టెక్నికల్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగం కాగా, హీరో అఖిల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే హైద్రాబాద్‌లో అఖిల్ ప్రమోషన్స్ సందడి మొదలవ్వగా, నేటినుంచి అఖిల్ స్వయంగా అమెరికా దగ్గర్నుంచి మొదలుపెట్టి భారీ ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు ఇంకా నెలరోజుల సమయం ఉండడంతో నిర్మాత నితిన్ భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలకు ప్లాన్ రూపొందించారు.
