‘సైజ్ జీరో’ ఆడియో రిలీజ్ డేట్..!

size-zero1
అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన సినిమా ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మించింది. తనదైన మార్క్ ప్రయోగాలతో హీరోయిన్‌గా సూపర్ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న అనుష్క, ఈ సినిమా కోసం 30 కేజీల బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చివరిదశకు చేర్చిన సినిమా యూనిట్, అక్టోబర్ 4న ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేసింది.

సంగీత దర్శకుడు కీరవాణి అందించిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా అదే రోజు విడుదల కానుంది. ఇక ఈమధ్యే విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తుండగా, సినిమాలోని మిగతా పాటలు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి అక్టోబర్ 9న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు పీవీపీ సంస్థ ప్లాన్ చేస్తోంది.

Exit mobile version