’10 ఎంద్రతుకుల్ల’లో సమంత యాక్టింగ్‌కు సూపర్ రెస్పాన్స్

samantha-10
తమిళ స్టార్ హీరో విక్రమ్, ట్రెండింగ్ హీరోయిన్ సమంతల కాంబినేషన్‌లో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ’10 ఎంద్రతుకుల్ల’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. తమిళంలో ఈ ఏడాదికి భారీ క్రేజున్న సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ’10 ఎంద్రతుకుల్ల’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో మొదటి రోజు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది.

ఓ రోడ్ జర్నీ నేపథ్యంలో రేసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి రివ్యూలే వచ్చాయి. యాక్షన్ సన్నివేశాలు, నటీనటుల పనితీరు ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా సమంత యాక్టింగ్‌పై ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రెండు విభిన్న ఎమోషన్స్ ఉన్న పాత్రలో సమంత ఒదిగిపోయి నటించిన విధానం కోలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది. ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో మరచిపోలేని పర్ఫామెన్సెస్ ఇచ్చిన సమంత, ఈ సినిమా ద్వారా మళ్ళీ తన స్థాయిని నిరూపించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేసేందుకు మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నెలలో తెలుగు వర్షన్ రిలీజయ్యే అవకాశం ఉంది.

Exit mobile version