ప్రభాస్ నెక్స్ట్ మూవీ లాంచ్ విశేషాలు.!

prabhas-sujith
ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో మర్చిపోలేని సంవత్సరంగా చెప్పుకోవాలి. ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటించిన బాహుబలి సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టడమే కాకుండా, ప్రభాస్ కి ఇంటర్నేషనల్ గా మార్కెట్ ని తెచ్చి పెట్టింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం డిసెంబర్ లో మొదలు కానున్న బాహుబలి 2 కోసం మళ్ళీ బాడీని బిల్డప్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి అనే విషయాన్ని పక్కన పెడితే..

బాహుబలి టైంలో ప్రభాస్ రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ బన్నెర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాని బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే గ్యాప్ లో ప్రభాస్ ఫినిష్ చేసెయ్యాలి అనుకున్నాడు. కానీ వెంటనే బాహుబలి 2 షూట్ అనుకోవడంతో ఆ సినిమాని పక్కన పెట్టేసారు. తాజాగా మేము అందుకున్న అధికారిక సమాచారం ప్రకారం, ప్రభాస్ బాహుబలి 2 షూట్ ఫినిష్ చెయ్యగానే ఈ సినిమా ఉంటుంది. ఎక్కువ భాగం వచ్చే ఏడాది జూలైలో ప్రభాస్ – సుజీత్ సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం సుజీత్ పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

Exit mobile version