
హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ హీరోగా, నందిత హీరోయిన్ గా తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ‘శంకరాభరణం’. హీరోయిన్ అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాకి ప్రముఖ రచయితా కోన వెంకట్ కథ – మాటలను అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని నిన్న సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో లాంచ్ కి అందాల భామ సమంత ముఖ్య అతిధిగా హాజరై, ఆడియోని రిలీజ్ చేసింది.
ఈ వేడుకలో కోన వెంకట్ మాట్లాడుతూ ‘సినిమాలో ప్రతి ఒక్కరూ తమ రోల్స్ కి పూర్తి న్యాయం చేసారు. శంకరాభరణం అనే సినిమాని 100 డిఫరెంట్ లొకేషన్స్ లో తీసాం. అన్ని లొకేషన్స్ తిరిగినా సాయి శ్రీరాం మాత్రం సూపర్బ్ విజువల్స్ ఇచ్చాడు. టాలీవుడ్ సినిమాలు కూడా బాలీవుడ్ స్థాయిలో తీయగలం అని నిరూపించడానికే ఈ శంకరాభరణం సినిమా చేసానని’ అన్నాడు. అలాగే శంకరాభరణం మెయిన్ స్టొరీ లైన్ ని బాలీవుడ్ హిట్ మూవీ ‘ఫస్ గయా రే ఒబామా’ అనే సినిమా నుంచి స్పూర్తిగా తీసుకున్నారు. బీహార్ కిడ్నాప్స్ నేపధ్యంలో సాగే ఈ సినిమాకి ఉదయ్ నందనవనం డైరెక్టర్.