
హ్యాట్రిక్ హీరో నిఖిల్ నటించగా, ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందించిన సినిమా శంకరాభరణం. ఓ సరికొత్త కాన్సెప్ట్‌టో క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 20వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు శంకరాభరణం టీమ్ నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం కోన వెంకట్ శంకరాభరణం సినిమాను డిసెంబర్ నెలకు షిఫ్ట్ చేసినట్లు ప్రకటించారు.
అక్కినేని అఖిల్ గ్రాండ్ ఎంట్రీ సినిమా ‘అఖిల్’ నవంబర్ 11న విడుదలవుతున్నందున ఆ సినిమాకు ఫ్రీ రన్ కల్పించాలన్న ఆలోచనతో శంకరాభరణంను వాయిదా వేస్తున్నట్లు కోన వెంకట్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం డిసెంబర్ 4వ తేదీకి శంకరాభరణం సినిమా ఫిక్స్ అయింది. బాలీవుడ్ సినిమా ‘పస్‌గయారే ఒబామా’ మూలకథతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈమధ్యే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో హ్యాపీగా ఉన్న టీమ్, ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా ఇప్పటికే వేగవంతం చేసేసింది. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాలో నందిత హీరోయిన్గా నటించగా హీరోయిన్ అంజలి ఓ కీలక పాత్రలో నటించారు.