సూపర్ స్టార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో థ్రిల్ అయిన క్రిష్!

krish
తెలుగులో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న క్రిష్, తాజాగా ‘కంచె’ సినిమా విజయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో మొట్టమొదటి భారతీయ సినిమాను తెరకెక్కించిన విశిష్టతను సొంతం చేసుకున్న క్రిష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం తన సినిమాకు వస్తోన్న రెస్పాన్స్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న క్రిష్‌కు దీపావళి పండుగ సందర్భంగా వచ్చిన ఒక ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్ మరింత సంతోషాన్నిచ్చింది. ఆ గిఫ్ట్ ప్యాక్‌ను క్రిష్‌కి పంపించింది మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్!

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ క్రిష్‌కు మహేష్ ఓ గిఫ్ట్ అందించారు. ప్రత్యేకంగా తయారుచేయబడిన పలు ఫుడ్ ఐటెమ్స్‌తో నిండిన ఈ గిఫ్ట్‌ను అందిస్తూ “మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు” అంటూ మహేష్ తన ఫ్యామిలీ తరపున ఈ విషెస్ తెలిపారు. ఇక మహేష్ నుండి వచ్చిన గిఫ్ట్‌తో హ్యాపీ అయిన క్రిష్, ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో పంచుకుంటూ మహేష్ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే.. గతంలో మహేష్, క్రిష్ కాంబినేషన్‌లో ఓ సినిమా చివరినిమిషంలో ఆగిపోగా, త్వరలోనే మహేష్‌తో ఓ సినిమా ఉంటుందని క్రిష్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. దర్శకుడు క్రిష్ ‘గబ్బర్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి కూడా సూపర్ స్టార్ మహేష్ కారణం కావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

Exit mobile version