
తెలుగు, తమిళంలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోన్న సమంత నటన స్థాయి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే, ఈగ లాంటి సినిమాలతో నటనలో తానేంటో నిరూపించి చూపిన సమంత, ఈమధ్యే విడుదలైన ’10 ఎంద్రతుకుల్ల’ సినిమాతో లుక్ విషయంలోనూ ప్రయోగం చేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సమంత మరో సరికొత్త లుక్‌లో, డీ గ్లామరైజ్డ్ పాత్రలో ఆకట్టుకునేందుకు సిద్ధమవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు.
తమిళ దర్శకుడు వెట్రిమారన్ త్వరలో తెరకెక్కించబోయే ‘వాడ చెన్నై’ అనే సినిమాలో సమంత ఓ స్లమ్ యువతిగా కనిపించనున్నారట. ఇందుకోసం సమంత పూర్తి డీ గ్లామరైజ్డ్ లుక్‌తో దర్శనమివ్వనున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకూ ఎక్కువగా యాక్టింగ్ పరంగానే మెప్పించిన సమంత ఈ సినిమాలోనూ యాక్టింగ్‌తో పాటు హీరోయిన్ అనే గ్లామర్ లుక్కు పూర్తి విరుద్ధమైన పాత్రలో కనిపించనుండడాన్ని ఆసక్తికరంగానే చూడొచ్చు.