సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోయే సినిమాలో అదితి రావ్ హైద్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ నుండి ఈ సినిమా ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ మూవీలో ప్రకాష్ రాజ్ సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కీలకంగా ఉన్న ఈ పాత్ర చెయ్యడానికి ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నట్లు సమాచారం.
స్పేస్ నేపద్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా లో సినియర్ నటి కనిపించబోతోందని తెలుస్తోంది. కాస్టింగ్ జరుగుతున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించబోతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో పాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మించబోతున్న సినిమాలో వరుణ్ నటించబోతున్నాడు.
