రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. చాన్నాళ్ల క్రితమే మొదలైన ఈ చిత్ర టెక్నికల్ వర్క్ ఎక్కువగా ఉండటం వలన కొంత మెల్లగా సాగుతోంది. చాలా నెలల క్రితమే చిత్ర టీమ్ దుబాయ్ లో నెల పాటు షూటింగ్ జరపాలని షెడ్యూల్ ప్లాన్ చేసింది. కానీ అనుమతులు దొరక్కపోవడంతో మార్చి 3వ వారంలో జరగాల్సిన షూటింగ్ వాయిదాపడింది.
ఎట్టకేలకు ఇప్పుడు అన్నీ అనుకూలించడంతో యూనిట్ దుబాయ్ వెళ్లారు. అబుదాబిలోని బుర్జ్ ఖలీఫా, ఇతిహాద్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి లొకేషన్లో షూట్ జరపనున్నారు. సుమారు 20 నిముషాల పాటు ఉండే హెవీ ఛేజింగ్ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రభాస్ ప్రత్యేకమైన శిక్షణ కూడ తీసుకున్నారు. ఈ షెడ్యూల్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో జరగనుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
