‘మహానటి’ విడుదలకు చిరంజీవికి సంబంధం ఏంటి !

సాధారణంగా సినిమాలు శుక్రవారం లేదా సెలవు కలిసొస్తే గురువారం విడుదలవుతుండటం మనం చూశాం. కానీ ‘మహానటి’ చిత్రాన్ని మాత్రం మే 9న అనగా బుధవారంనాడు విడుదల చేస్తున్నారు నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు. ఇలా బుధవారంనాడు రిలీజ్ చేయమని వాళ్ళ తండ్రి, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారే సలహా ఇచ్చారట.

ఎందుకంటే 1990లో చిరంజీవి హీరోగా ఆయన నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా మే 9వ తేదీనే విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ ప్రకారమే ఆ తేదీని సజెస్ట్ చేశారట ఆయన. తండ్రి మాట ప్రకారమే పిల్లలు కూడ మే 9న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సావిత్రిగారి జీవితం ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Exit mobile version