కట్ చేసిన సన్నివేశాలను విడుదల చేసిన ‘భరత్ అనే నేను’ టీమ్ !

మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ గత నెల 20న వీడియూదాలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెల్సిందే. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్ర కథను ముందుగా చాలా పెద్దగా రాసుకున్నానని, తీయడం కూడ కొంచెం పెద్దగా తీసి ఎడిటింగ్ ద్వారా చాలా సన్నివేశాలను కట్ చేసి చివరికి 2 గంటల 53 నిముషాల సినిమాను తయారుచేశామని, ఆ మిగతా సీన్లను కూడ కలిపితే చిత్రాన్ని రెండు పార్ట్స్ చేయవచ్చని కొరటాల శివ పలు సందర్భాల్లో అన్నారు.

ఇప్పుడు ఆ కట్ చేసిన సన్నివేశాలని ఒక్కొక్కటిగా యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తూ వస్తున్నారు టీమ్. వాటిలో అసెంబ్లీ సీన్, రైతులు, పల్లె జనాల సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూసిన చాలా మంది ప్రేక్షకులు ఇంత మంచి సన్నివేశాలను సినిమా నుండి ఎలా తీసేశారు, సినిమాను రెండు భాగాలుగా చేసి ఉండాల్సింది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సన్నివేశాలే హాట్ టాపిక్ గా మారిపోయాయి.

Exit mobile version