ప్రమోషన్స్ తో ఆసక్తిని రేపుతోన్న మహానటి!


టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న మొట్ట మొదటి సినీ నటి బయోపిక్ మహానటి మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సావిత్రి జీవితాన్ని తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. సినిమాకు సంబందించిన పోస్టర్స్ ని టీజర్స్ ని విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే ఎక్కువగా ఆమె పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. అచ్చం సావిత్రి మాదిరిగా ఉన్న కీర్తి సురేష్ ని చూస్తూ అభిమానులు పాజిటివ్ గా రెస్పాండ్ అవవుతున్నారు. జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్న తీరు కూడా సినిమాపై పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేస్తోంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ – సమంత ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్ బాబు, నాగ చైతన్య, క్రిష్, శ్రీనివాస్ అవసరాల, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా మహానటిలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version