వైజయంతి మూవీస్ నిర్మించకుంటే ‘మహానటి’కి నో చెప్పేవాడిని – దేవరకొండ

ప్రముఖ నిర్మాత అశ్విని దత్ యొక్క వైజయంతి మూవీ బ్యానర్లో ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలు కలిసి నిర్మించిన చిత్రం ‘మహానటి’. రేపు విడుదలకానున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ , సమంత, దుల్కర్ సల్మాన్, నాగ చైతన్యలతో పాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడ నటించారు. ఇందులో ఆయన చేసింది ‘విజయ్ ఆంటోనీ’ అనే పాత్ర.

ఈ సినిమాలో తనది చిన్నపాత్రే అయినా బాగుంటుందని చెప్పిన ఆయన ఈ సినిమా వెనుక నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ లేకుంటే చేసుండేవాడిని కాదని, నాగి, స్వప్నలతో ఉన్న బాండింగ్ వల్లనే ఈ సినిమా ఒప్పుకున్నానని అన్నారు. అలాగే సినిమాలో తనది సమంత పోచించిన మధురవాణి పాత్రకు సపోర్ట్ గా ఉండే రోల్ అని కూడ అన్నారు.

Exit mobile version