
విడుదలైన అన్ని చోట్ల మంచి సినిమా అనే ప్రశంసలందుకుంటోంది ‘మహానటి’ చిత్రం. సినిమాను చుసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు దర్శకుడు నాగ్ అశ్విన్ ను, సావిత్రి పాత్రలో గుర్తుండిపోయే నటన కనబర్చిన కీర్తి సురేష్ ను కొనియాడుతున్నారు. కలెక్షన్ల పరంగా కూడ సినిమా సత్తా చాటుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో వసూళ్లు రోజు రోజుకి మెరుగుపడుతున్నాయి.
నైజాంలో మొదటి 5 రోజులకుగాను రూ.3.47 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం నిన్న సోమవారం రూ.68.50 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మొత్తం మొదటి రోజు షేర్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ పెరుగుదలే జనాల్లో సినిమా పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. మొత్తం మీద ఈ చిత్రం 6 రోజులకు గాను రూ.4.16 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఓవర్సీస్లో కూడ 1.5 మిలియన్ డాలర్లను దాటేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో రెండున్నర మిలియన్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా.