చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం సామీ స్క్వేర్. ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్న తమిళ నటుడు బాబీ సింహ మూడు విభిన్నగెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. దాంతో ఈ చిత్రం ఫై అంచనాలు మరింతగా పెరిగాయి.
విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని హరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో’ సామి-2’గా రానున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.
