రేపు ఉదయం ట్రైలర్ తో వస్తున్న తమిళ్ స్టార్..!

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం సామీ 2. మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో విక్రమ్ డబుల్ రోల్లో నటిస్తున్నాడు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ పోలీస్ స్టోరీలకు హరి పెట్టింది పేరు కావడంతో, సామి పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Exit mobile version