‘తారామణి’ బాగా బోల్డ్ గా ఉంటుందా !

చిన్నదే అయినా పెద్ద విజయం సాధించిన తమిళ చిత్రం ‘తారామణి’. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి అదే పేరుతో అనువాదం చేశారు. ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి యువత ప్రవర్తనకు అద్దం పట్టేలా కాంటెంపరరీ రొమాంటిక్ రిలేషన్ షిప్స్ లో జరిగే మార్పులని కథాంశంగా తీసుకుని ట్రయాంగులర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కించారు.

ఒక విధ౦గా ఈ చిత్ర౦ చాలా బోల్డ్ గా ఉండబోతుందట. మరి బోల్డ్ కంటెంట్ ను తమిళ ప్రేక్షకులు ఆదరించిన౦తగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అంటే చూడాలి. అయితే, ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ రామ్ కథ, దర్శకత్వం అందించారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.

Exit mobile version