ఆ హీరో సినిమా రిజక్ట్ చేసి షాక్ ఇచ్చిన హీరోయిన్ ?

sai pallavi

తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. తాజాగా సినీవర్గాల సమాచారం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే సాయి పల్లవి ఆ అవకాశాన్ని రిజక్ట్ చేసిందని తెలుస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాల్లో ఇప్పటివరకు టాప్ హీరోయిన్స్ తోనే జతకట్టాడు. కాజల్, సమంత లాంటి హీరోయిన్స్ కూడా అతని సరసన నటించడానికి ఒప్పుకున్నారు. అలాంటిది వారి కన్నా స్టార్ డమ్ తక్కువ ఉన్న సాయి పల్లవి, ఎక్కువ మొత్తం ఆఫర్ చేసినప్పటికీ ఆమె బెల్లంకొండ సినిమాని మర్యాదపూర్వకంగానే రిజక్ట్ చేస్తూ అందర్నీ షాక్ గురి చేసింది.

ప్రస్తుతం సాయి పల్లవి హనురాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ కి జోడిగా ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో సాయి పల్లవి తన నటనతో మరిసారి తెలుగు ప్రేక్షకులను సమ్మోహనపరచటం ఖాయం అని ఆ చిత్రబృందం చెబుతుంది.

Exit mobile version