రైల్వే స్టేషన్ లో అరవింద తో వీర రాఘవ !

ntr5

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత ‘చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో ఎన్టీఆర్ , పూజా హెగ్డే లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈచిత్ర టీజర్ ను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15 న విడుదలచేయనున్నారు. ఈ రెండు రోజుల్లో టీజర్ విడుదల సమయాన్ని కూడా ప్రకటించనున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు నటిస్తుండగా రావు రమేష్ , జగపతి బాబు, ఈషా రెబ్బ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకానుంది.

Exit mobile version