ఎన్టీఆర్ బయోపిక్ లో కోమలి సిస్టర్ !

heroshini komali
తెలుగు రాష్ట్రాల్లో చిన్నతనంలోనే మిమ్మిక్రి తో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కోమలి సిస్టర్స్ . ఇందులో ఒక సిస్టర్ హిరోషిణి కోమలి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లోనటిస్తుంది. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి పాత్రకు కోమలి ని తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె సెట్ లో కూడా జాయిన్ అయ్యారు. ఇక హిరోషిణి ఇంతకుముందు త్రివిక్రమ్ తెరకేకించిన ‘అఆ’ చిత్రంలో నితిన్ కు చెల్లి గా నటించింది.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆదారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్ , విద్య బాలన్ , రానా, మురళి శర్మ, మంజిమ మోహన్ , సుమంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలకృష్ణ ,విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Exit mobile version