గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో NBK111 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లా్న్ చేస్తోంది.
కాగా, ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ చిత్రాన్ని దసరాకు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా, బాలయ్య ఇప్పుడు మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల డైరెక్షన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విజయ్ కనకమేడల బాలయ్యకు కథను వినిపించాడని.. దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుందట.
