‘మళ్ళీ రావా’ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని జెర్సీ అనే చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈచిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతం అందించనున్నారు. నాని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ చిత్ర నిర్మాణ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈచిత్రంలో నాని అర్జున్ పాత్రలో నటించనున్నారు. ఇక ప్రస్తుతం ఆయన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవదాస్’ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున తో కలిసి నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రంషూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈషూటింగ్ కంప్లీట్ చేసి నాని జెర్సీ సెట్లో అడుగుపెట్టనున్నాడు.
