సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ద్వి భాష చిత్రం ‘నోటా’. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక ట్రైలర్ చూస్తే ఈసినిమా పొలిటికల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లుగా అనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ ముఖ్య మంత్రి పాత్రలో నటిస్తుండగా నాజర్ , సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెహ్రీన్ ఈచిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుండగా ,సంచనా నటరాజన్ రాజకీయనాయకురాలి పాత్రలో నటిస్తుంది. మొత్తానికి ట్రైలర్ చిత్రం ఫై ఆసక్తిని పెంచేసింది.
స్టూడియో గ్రీన్ పతాకం ఫై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు , తమిళ భాషల్లో అక్టోబర్ 4న విడుదల కానుంది. ఇక ఇటీవల విజయ్ నటించిన ‘గీతగోవిందం’ తమిళనాడులో రికార్డులను క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు ఈ ‘నోటా’ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
