వినాయక చవితి సందర్భంగా రాబోతున్న ‘కురుక్షేత్రం’ !

arjun

బహుభాషా హీరో అయిన యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కురుక్షేత్రం’. ఇది అర్జున్ కు 150వ చిత్రం కావడంతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. హీరో నాని చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కిందట. క్రైం యాక్షన్‌ని ఇష్టపడే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుందని చిత్రబృందం చాలా నమ్మకంగా ఉంది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో అర్జున్‌ తో పాటు సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, వరలక్ష్మి శరత్ కుమార్, శ్రుతి హరిహరన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకం ఫై మీసాల శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నవీన్‌ సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం అర్జున్ ఇటు హీరోగానూ, అటు సినిమాలోని ఇతర కీలకమైన పాత్రలోనూ నటిస్తూ మెప్పిస్తున్నాడు.

Exit mobile version