నాగ్ నటించనున్న మరో మల్టీ స్టారర్ ప్రారంభమైంది !

Nagarjuna

ప్రస్తతం సీనియర్ అగ్ర హీరో కింగ్ నాగార్జున మల్టీ స్టారర్ చిత్రాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. దాంట్లో భాగంగా శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని తో కలిసి దేవదాస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈనెల 27న విడుదలకానుంది. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ , రణబీర్ కపూర్ లతో కలిసి బ్రహ్మస్త్ర అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఇక ఇప్ప్డుడు నాగ్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలసి నాగ్ నటించనున్న చిత్రం యొక్క పూజ కార్యక్రమాలతో నిన్న లాంచ్ అయింది. ‘పవర్ పాండి’ చిత్రంతో దర్శకుడిగా మారిన ధనుష్ ఈ చిత్రాన్ని కూడా ఆయనే తెరకెక్కిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ కానున్నారు నాగ్.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. సీన్ రోనాల్డ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అదితి రావ్ హైదరి కథానాయికగా నటిస్తుంది.

Exit mobile version