మెగా అభిమానులకు గుడ్ న్యూస్ !

Rc123

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్స్ వచ్చేశాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అలాగే టీజర్ విడుదల తేదీలను చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. మొదటగా దీపావళి కానుకగా నవంబర్ 6న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఆతరువాత నవంబర్ 9న ఉదయం 10 : 25గంటలకు ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు రామ్ చరణ్.

ఇక ఈ చిత్రానికి ‘వినయ విధేయరామ’ అనే టైటిల్ దాదాపుగా ఖరారు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

Exit mobile version