ఎన్టీఆర్ తో ఎస్వీఆర్.. షూటింగ్ ప్రారంభం !

ntr33

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్ తో పోటాపోటీగా నటించి మెప్పించిన గొప్ప నటుడు ఎస్వీఆర్. క్రిష్, ఎస్వీఆర్ పాత్రలో నటించే నటుడ్ని ఇటివలే ఫైనల్ చేశారు. ఓ థియేట‌ర్ ఆర్టిస్టుకు ఎస్వీఆర్ పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకే ఆయన్నే తీసుకున్నారు. కాగా ఈ రోజే బాలయ్య మరియు ఆ నటుడి పై షూట్ చేయనుంది చిత్రబృందం.

అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version