బయోపిక్ తో సన్నద్ధం అయిన ‘షకీలా’ !

Richa shakeela1

మలయాళంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ‘షకీలా’ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. యువత ఆమె చిత్రాల కోసం తెగ పోటీపడి మరీ చూసేవారు. అలాంటి ‘షకీలా’ జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే.

కాగా, షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు పూర్తీ చేసుకుని విడుదలకు సన్నద్ధం అయింది.

ఇక ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షకీలా అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. తన బయోపిక్ గురించి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.. తన జీవితంలోని అతి ముఖ్యమైన తప్పులు, ఒప్పులు ఇలా ప్రతి అంశం ఈ బయోపిక్ లో ఉంటాయని తెలిపింది.

Exit mobile version