సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘పేట’ వచ్చే ఏడాది జనవరి 11న విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ చిత్రం తమిళ్ ,తెలుగు తో పాటు ఒకేసారి కన్నడ భాషలో కూడా విడుదలకానుంది. ప్రస్తుతం వాటికి సంబందించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. కర్ణాటకలో కూడా రజినీ కి మంచి ఫాలోయింగ్ ఉండండంతో ఈ చిత్రాన్ని నేరుగా కన్నడలోకి డబ్ చేస్తున్నారు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక తెలంగాణ , ఏపీ , కర్ణాటక , కేరళలో ఈచిత్రం యొక్క థియేట్రీకల్ హక్కులు 32కోట్లకు అమ్ముడైయ్యాయని సమాచారం. ఇటీవల ‘సర్కార్’ తెలుగులో విడుదలచేసిన అశోక్ వల్లభనేని ఈ పేట హక్కులను దక్కించుకున్నాడు. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
