ఫస్ట్ లుక్ తో వచ్చిన ‘మళ్లీ మళ్లీ చూశా’ !

Malli Malli Chusa
అనురాగ్ కొణిదెన హీరోగా నూతన దర్శకుడు సాయిదేవ రామన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అలాగే మోషన్ పొస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ ఒక అందమైన కలను కథగా మార్చుకుని ప్రకృతి సృష్టించుకున్న అద్భుతమైన ప్రేమ కావ్యం మా “మళ్లీ మళ్లీ చూశా” సినిమా. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుంది, ఆ ప్రకృతే ఒక ప్రేమను సృష్టిస్తే ఇంకెంతో అద్భుతంగా ఉంటుంది. ఆ అద్బుతమే ఈచిత్రం అని అన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, వైజాగ్, అరకు లొని అందమైన లొకెషన్స్ లొ షూటింగ్ చేశాం. మనస్సుకు హత్తుకునే అహ్లాదకరమైన చిత్రం మా “మళ్లీ మళ్లీ చూశా” అన్నారు.

హీరొ అనురాగ్ మాట్లాడుతూ. ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవు తున్నందుకు ఆనందంగా వుందన్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించె ప్రేమకథ ఇదన్నారు.

Exit mobile version