పేట లో కూడా సన్నివేశాలను తొలగించనున్నారట ?

Petta6
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘పేట’ జనవరి 10న విడుదలై కోలీవుడ్ లో పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం యొక్క నిడివి ఫై ప్రేక్షకులనుండి మిశ్రమ స్పందన రావడంతో ఈ చిత్రం లోని సెకండ్ హాఫ్ లో 20 నిమిషాల సన్నీవేశాలను తొలిగించి సినిమా ప్రదర్శించాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్.

2గంటల 52 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ బాగుందని సెకండ్ హాఫ్ సాగదీసినట్లుగా అనిపించిందన్న టాక్ రావడంతో థియేటర్ల యాజమాన్యం కోరిక మేరకు చిత్రం బృందం ఈ చిత్రాన్ని ట్రిమ్ చేయనున్నారట. మరో రెండు రోజుల్లో పేట కొత్త వెర్షన్ థియేటర్లలోకి రానుంది. ఇక తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ట్రిమ్ చేసే ఆలోచనలో వున్నారు. అసలే తెలుగులో డివైడ్ టాక్ రావడంతో ఈకొత్త వెర్షన్ వల్ల కలెక్షన్లు పెరిగే ఛాన్స్ కూడా వుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

Exit mobile version