హన్సిక మహా లో ఆ హీరో కన్ఫర్మ్ !

Simbu
హీరోయిన్ హన్సిక ప్రస్తుతం తన 50 వచిత్రం ‘మహా’ లో నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ హీరో శింబు ముఖ్య పాత్రలో నటించనున్నాడని నిన్న కథనాలు వెలుబడ్డాయి. ఇక తాజాగా ఆ వార్తలను మేకర్స్ ధ్రువీకరించారు. శింబు పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం కానుందట. ఇక గతంలో శింబు ,హన్సిక ప్రేమించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు. బ్రేక్ అప్ తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కూడా ఇదే.

నూతన దర్శకుడు జమీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ ,నాజర్ , తంబీ రామయ్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ,తమిళ భాషల్లో విడుదలకానుంది.

Exit mobile version