గౌతమ్ మీనన్, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’. గత మూడు సంవత్సరాల నుండి నిర్మాణంలో వున్నా ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రం ఏప్రిల్ 4న విడుదలకానుంది. తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదలచేయనుంది. తర్వలోనే ఈచిత్రం యొక్క ట్రైలర్ కూడా విడుదలకానుంది.
శివ సంగీతం అందించిన ఈచిత్రంలో మెగా ఆకాష్ కథానాయికగా నటించిన శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఈచిత్రాన్ని గౌతమ్ మీననే నిర్మిస్తున్నారు.
