దసరా రేసులో పాయల్ రాజ్ పుత్ ‘ఆర్డీఎక్స్ లవ్’.

RDX1

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా తెలుగు కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఆమెకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఐతే ఆమెకు ఆ స్థాయి అవకాశాలు మాత్రం రాలేదు. ఐతే పాయల్ ఆర్డీఎక్స్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. నూతన హీరో తేజుస్ కంచెర్ల హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ నే ప్రధాన పాత్ర చేయడం జరిగింది.

కొంచెం బోల్డ్ కంటెంట్ తో పాటు, కథా బలంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. కాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ని నిర్ణయించారు. వచ్చేనెల 11న ఆర్డీఎక్స్ లవ్ మూవీ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

Exit mobile version