‘విజయ్ దేవరకొండ’ కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే సెన్సేషనల్ హీరోగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ టాలెంట్ కి ప్రోత్సాహం అందించేందుకు “మీకు మాత్రమే చెప్తా ” అనే సినిమాతో విజయ దేవరకొండ నిర్మాతగా తొలి అడుగు వేయబోతున్నాడు. అతి తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ కు విక్రయించేసారు.
కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందట. అక్టోబర్ 18న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ఫస్ట్ సాంగ్ విడుదల అయ్యాయి. టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి విజయ్ తన అభిరుచిని పరిచయం చేయబోతున్నాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తరుణ్ లీడ్ రోల్ చేస్తున్నాడు .
