ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరుగుతోన్న అకృత్యాలను ఆధారంగా తీసుకొని మిర్రర్ చిత్రాన్ని తెరకెక్కించారు శ్రీ మల్లిఖార్జున మూవీస్ వారు. ఈ చిత్రానికి ఎ .సాయి కుమార్ దర్శకుడు. శ్రీనాథ్, హరిత జంటగా నటించారు. నెల 27న సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భంగా ఎన్.అర్జున్ సంగీతాన్నీ సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ప్రసాద్ లాబ్స్ లో సోమవారం రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో ఆడవారి పై జరుగుతోన్న వేధింపులను బేస్ చేసుకొని ఈ సినిమా చేసారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. నిజంగా ఇది గొప్ప విషయం. ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత అందరి పై ఉంది. ఇంత మంచి ప్రయత్నాన్ని చేసిన దర్శక నిర్మాతలను అభినందిస్తూ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ … మిర్రర్ టైటిల్ , పాటలు బావున్నాయి. మధుర ఆడియో ద్వారా పాటలు రిలీజ్ చేస్తున్నాం. టీం అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు. ట్యూన్స్ కంపోజ్ చేయడమే కాకుండా లిరిక్స్ రాసే అవకాశం కల్పించిన దర్శకుడు సాయి కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. హీరో శ్రీనాథ్ మాట్లాడుతూ… దర్శకుడు అన్నీ తానై ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మా కో- ప్రొడ్యూసర్స్ సహకారం వల్లే సినిమాను రిలీజ్ చేయగలుగుతున్నాం. ఈ నెల 27న వస్తోన్న మా సినిమాను చూసి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నా అన్నారు.
